గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 11 అక్టోబరు 2018 (09:34 IST)

చైతు - స‌మంత మ‌జిలి ప్రారంభం..!

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత క‌లిసి ఏమాయ చేసావే, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో న‌టించారు. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 6న పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. పెళ్లి త‌ర్వాత ఈ క్రేజీ క‌పుల్ క‌లిసి న‌టిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాకి నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత‌న్య‌, స‌మంత భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తుండ‌టం విశేషం. 
 
ఈ చిత్రం టైటిల్‌ మజిలి అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే.. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ టైటిల్‌నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మజిలీ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయించారట. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. 
 
హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 10న హైద‌రాబాద్ లో జ‌రిగిన షూట్ లో చైత‌న్య‌, స‌మంత పాల్గొన్నారు. ఈ వైవిధ్య‌మైన క‌థా చిత్రం చైత‌న్య - స‌మంత జంట‌కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.