శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:01 IST)

54 ఏళ్ల టీచర్‌ను పెళ్లాడిన 19ఏళ్ల యువతి.. ఉరేసుకుని ఆత్మహత్య

54 ఏళ్ల టీచర్‌ను వివాహం చేసుకున్న 19ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం, వాళప్పాడి, ఆత్తుమేడు ప్రాంతానికి చెందిన మధురైవీరన్ కుమార్తె గాయత్రి (19)కి నామక్కల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి ఇచ్చి పెళ్లి చేశారు. అతడి వయస్సు 54 ఏళ్లు. 
 
ప్రభుత్వ ఉద్యోగం వుందని వయస్సును కూడా పెద్దగా పట్టించుకోకుండా గాయత్రిని 54 ఏళ్ల టీచర్‌ దురైసామికి గత ఏడాది వివాహం చేశారు. అయితే గాయత్రి దురైసామి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై గాయత్రి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 54 ఏళ్ల వ్యక్తితో 19 ఏళ్ల యువతి వివాహం ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది.