సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (17:19 IST)

కోరిక తీర్చలేదని మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

మైనర్ బాలికపై ఓ కామాంధుడు అమానుషంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చలేదని.. ఓ కామాంధుడు బాలికకు నిప్పంటించాడు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు, కౌతాలం మండలం బదినేహల్‌కి చెందిన మౌలాలీ, ఓ మైనర్ బాలికను ఏడాది నుంచి లైంగిక వేధింపులకు గురిచేశాడు. 
 
భార్యతో పాటు ముగ్గురు పిల్లలు వున్నా బాలికపై కన్నేశాడు. తన కోరిక తీర్చమని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మౌలాలీని హెచ్చరించారు. అయినా కామాంధుడు బుద్ధి మార్చుకోలేదు. దీంతో బాలిక తన ఇంట్లో ఒంటరిగా వున్నట్లు గమనించిన మౌలాలీ బాలికను బలవంతం పెట్టాడు. 
 
అందుకు బాలిక ప్రతిఘటించడంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను బాలికపై నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.