గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (10:17 IST)

శ్మశానంలోనే 41 రోజులు గడిపిన ఆ కుటుంబం.. ఎందుకంటే?

ఆధునికత, సాంకేతికత ఎంత పెరిగినా.. మూఢనమ్మకాలపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దేశంలో నరబలులు అధికమవుతున్నాయి. తాజాగా చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు 41 రోజుల పాటు శ్మశానంలోనే ఓ కుటుంబం గడిపింది. శ్మశానాన్ని ఖాళీ చేయమన్నందుకు గ్రామస్థులపై వారు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ తుపాకుల శ్రీనివాస్ 40 రోజుల క్రితం డెంగీతో మృతి చెందాడు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, శ్రీనివాస్ మరణించడానికి ముందు రైల్వేకోడూరులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తి చేతబడి చేయడంతో శ్రీనివాస్ మరణించాడని కుటుంబీకులు అనుకున్నారు. 
 
మరణించిన శ్రీనివాస్‌ను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులంతాక్షుద్రపూజలు చేసే ఓ తాంత్రికుడిని సంప్రదించారు. అతను కూడా శ్రీనివాస్‌ను బతికిస్తామని హామీ ఇచ్చాడు. ఇందుకోసం శ్మశానంలో 41 రోజులు పూజలు చేశాడు. ఇందుకోసం రూ.8లక్షలు ఖర్చు చేయాలన్నాడు. శ్రీనివాస్ కుటుంబం కూడా శ్మశానంలోనే 41 రోజుల పాటు మకాం వేసింది. 
 
విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరితే వారిపైనే తిరగబడ్డారు. కత్తులతో బెదిరించారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. శ్రీనివాస్ కుటుంబీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.