శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:13 IST)

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ ఒకే ప్రయాణం...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాది పైగా గ్యాప్ తర్వాత ఫైనల్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో బుధవారం నుంచి పాల్గొనబోతున్నాడు. ఇంత గ్యాప్ కారణంగా నిరాశగా ఉన్న అభిమానులను అలరించడానికి మూడు ప్రాజెక్ట్‌లు అనౌన్స్ చేసిన బన్నీ వాటన్నింటినీ రెండేళ్ల లోపే విడుదయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 
 
ఇదిలావుంటే, బౌండ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న వేణు శ్రీరామ్ తీయబోయే ఐకాన్‌కు సంబంధించిన ఒక అప్‌డేట్ అభిమానులను ఆందోళన పెడుతోంది. ఈ సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉండబోతోంది. ఇలాంటి రిస్క్ బన్నీ గతంలో చేశాడు. క్రిష్ దర్శకత్వం వహించిన "వేదం"లో కేబుల్ రాజుగా పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆ సినిమాలోని ట్రాజడీ ఫినిషింగ్ మనసును తాకేలా ఉన్నా కమర్షియల్ రన్ మీద పడి కల్ట్ స్టేటస్ అయితే దక్కించుకుంది. 
 
కానీ రేంజ్‌పరంగా బయ్యర్లకు కల్పవృక్షం కాలేకపోయింది. ఇప్పుడు బన్నీకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అప్పట్లోనే రిస్క్ అనిపించింది. ఇప్పడు ఎలా ఉండబోతోందనే సందేహం అందరికీ వస్తుంది. ఇలాంటి ఫినిషింగ్ ఉంటుదన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కొన్ని హీరోలకు ఇది వర్కౌట్ అయినా ఇది అందరికీ సెట్ కాదు. చిత్ర యూనిట్ ఇప్పుడు దీనిపైనే చర్చ సాగిస్తోంది.