ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ.. ఇంటికెళ్లి మరీ.. (video)
Mudragada_Varma
ఇకపోతే.. ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఒక వాదన వినిపిస్తోంది. అయితే, ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వర్మ వైసీపీలో చేరేందుకే పద్మనాభంతో భేటీ అయ్యారని టాక్ వస్తోంది.
వైసిపి నాయకులు కాపు నేత ముద్రగడ పద్మనాభం గారిని కలిసిన పిఠాపురం వర్మ.. pic.twitter.com/PljO03eJIr
— Surya krishna (@SuryaBhagat7) September 9, 2025
