పాడేరు అడవిలో 'ఆకాశవాణి'
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారారు. ఆయన షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న "ఆకాశవాణి" అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఈగ', 'బహుబలి' వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రముఖ తమిళనటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పాడేరు అడవుల్లో 50 రోజుల భారీ షెడ్యూల్ చేశారు. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది.
ఈ చిత్రం దట్టమైన అడవిలో ఓ రేడియో చుట్టూ సాగే కథ ఇది. పాడేరు అడవిలో వేసిన భారీ సెట్‌లో దాదాపు 50 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేసి, చాలా క్రిటికల్ సీన్స్ పిక్చరైజ్ చేసాం.. ఈ షెడ్యూల్ అడ్వెంచరస్‌గా సాగింది.. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.