సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:37 IST)

కొనసాగుతున్న రాజమౌళి అన్వేషణ .. శ్రద్ధాకపూర్‌పై మనసుపడిన జక్కన్న?

దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కొత్త ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటిస్తున్నారు. వీరికి జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్‌, బ్రిటన్ నటి లూసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా లూసీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. 
 
దీంతో లూసీ స్థానంలో కొత్త హీరోయిన్‌ కోస దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్వేషిస్తున్నారు. ఈ కోవలో ఆయన పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరిలో శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, నిత్యా మీనన్ ఇలా అనేక మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. వీరందరిలో శ్రద్ధా కపూర్‌పై రాజమౌళి మనసుపడినట్టు తెలుస్తోంది. 
 
గ్లామర్ పరంగా నటన పరంగా ఈ సుందరికి వంకబెట్టవలసిన అవసరం లేదు. అలాంటి శ్రద్ధా కపూర్.. 'సాహో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీలో చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగరులో వినిపిస్తోంది.
 
పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సూట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె 'చిచ్చోరే'.. 'స్ట్రీట్ డాన్సర్' సినిమాలు కూడా సెట్స్‌పై వున్నాయి. అయినా డేట్స్ సర్దుబాటు చేయించి.. ఈ సినిమాకి తీసుకురావాలనే దిశగా రాజమౌళి సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోందట. ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.