శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (19:18 IST)

రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ డైరెక్టర్

భారీ బడ్జెట్ తెలుగు సినిమాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" చిత్రంపై దేశం మొత్తం మంచి క్రేజ్ ఉంది. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'బాహుబలి' ఘన విజయం తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత దానయ్య 202
0 జులై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
 
ఈ సినిమా కథలో నార్త్ ఇండియా కూడా ఇన్‌వాల్వ్ అవుతున్నందున బాలీవుడ్ నుండి కూడా నటులను ఎంపిక చేసారు రాజమౌళి. హీరోయిన్‌గా ఆలియా భట్, కీలకపాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తుండగా మరికొంత మందితో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ వచ్చింది. 
 
ఇకపోతే, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉత్తరాదిలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఈయన తన సినిమాలను ఎక్కువగా రంజాన్ టైమ్‌లో విడుదల చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కలిసి దాదాపు 19 ఏళ్ల తర్వాత ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసారు. ఇందులో కూడా ఆలియా భట్ హీరోయిన్‌గా చేస్తోంది. 
 
ఈ చిత్రాన్ని 2020 రంజాన్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రంజాన్ జూన్ 30న వస్తుండగా రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా జరిగితే రెండు సినిమాలకీ నష్టమే. మరి ఇప్పుడు ఏ సినిమా వెనక్కు తగ్గుతుందో చూడాలి మరి.