శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (17:00 IST)

రాజమౌళి "ఆర్ఆర్ఆర్" చిత్రంలో అలియా భట్ రెమ్యునరేషన్ ఎంత?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్‌లను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాజమౌళి ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వెల్లడించారు. 
 
పైగా, అలియా భట్‌ను తీసుకోవడానికిగల కారణాలను కూడా రాజమౌళి వివరించారు. రాజమౌళి కథ చెప్పగానే నచ్చిందని, తప్పకుండా చేస్తానని చెప్పిన అలియా భట్... రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదని సమాచారం. ఈ క్రమంలో ఆమెతో పలు దఫాలు చర్చలు జరిపారట. ఆమె సంతకం చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటించారు.
 
బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో అలియా భట్ వరుస చిత్రాల్లో నటిస్తూ మంచి బిజీగా ఉన్నారు. తన అద్భుతమైన నటనతో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా మారింది. పలు బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. 'రాజీ' సినిమా విజయం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ మరింత పెరిగిందట. ఈ చిత్రానికి రూ.7.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 
 
కాగా, ఈ చిత్రంలో అలియా భట్ హీరో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన బ్రిటీషన్ నటి డైసీ నటిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరు సీతారామారాజు, కొమరం భీమ్‌ల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.