రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ చెప్పిన డేట్‌‍కి రిలీజ్ అవుతుందా..? లేదా..?

Rajamouli-NTR-Ramcharan
శ్రీ| Last Modified శనివారం, 16 మార్చి 2019 (20:17 IST)
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టార‌ర్ దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం... సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వ‌ర‌లో థ‌ర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ఈ సంచ‌ల‌న చిత్రాన్ని 2020లో జులై 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత దాన‌య్య‌ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ మూవీ గురించి బాహుబ‌లి నిర్మాతల్లో ఒక‌రైన‌ శోభు యార్ల‌గ‌డ్డ ట్విట్ట‌ర్లో... జులై 30 వ‌ర‌కు వెయిట్ చేయ‌లేక‌పోతున్నాను. బాహుబ‌లి సినిమా కోసం అభిమానులు ఎంత‌లా ఎదురుచూసారో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది. ఆర్ఆర్ఆర్ టీజ‌ర్ కానీ.. ట్రైల‌ర్ కానీ.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? ఇప్పుడు నేను అభిమాని స్ధానంలో ఉండి అడ‌గ‌డం న‌చ్చిందని అన్నారు.

అయితే... ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌కుండా చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతుందని న‌మ్మ‌కం ఉందా అని ఓ నెటిజ‌న్ శోభుని అడిగారు. దీనికి శోభు స్పందిస్తూ... నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా ఎలాంటి వాయిదాలు లేకుండా ఖ‌చ్చితంగా జులై 30నే విడుదల అవుతుంది. బాహుబలి 2 కూడా వాయిదా పడకుండా ముందుగా చెప్పిన డేట్‌కే రిలీజ్ అయ్యింది కదా అన్నారు. మ‌రి... నిజంగా చెప్పిన డేట్‌కి ఆర్ఆర్ఆర్ వ‌స్తుందో లేదో చూడాలి.దీనిపై మరింత చదవండి :