ఏటీఎం నుండి డ్రా చేసిన డబ్బులు చూసి షాక్‌ అయిన కస్టమర్‌..!

new  currency note
మోహన్| Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (15:45 IST)
ఏటీఎం నుండి నగదు డ్రా చేసిన వ్యక్తి డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. డ్రా చేసిన సొమ్ములో చిరిగిన నోట్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన విజయవాడలోని మైలవరంలో వెలుగుచూసింది.

మద్దాలి గణేష్ అనే వ్యక్తి నారాయణ థియేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.30 వేలు డ్రా చేశాడు. అందులో 10 రెండు వేల రూపాయల నోట్లు చిరిగినవి వచ్చాయి. చిరిగిన నోట్ల విలువ రూ.20 వేలు ఉండడంతో అతను ఒక్కసారిగా విస్మయం చెందాడు.

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను మోసం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురికి ఏటీఎంలో చిరిగిన నోట్లు దర్శనమిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదివరకు కూడా అనేక మార్లు చిరిగిన నోట్లను ఏటీఎంలో పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతంకాకుండా చూసుకోవాలని కోరారు.దీనిపై మరింత చదవండి :