శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (20:19 IST)

రాశి - రంభలకు షాక్.. వారిద్దరి వాణిజ్య ప్రకటనలు వద్దనే వద్దు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకనాటి హీరోయిన్లు రాశి, రంభలకు విజయవాడ వినియోగదారుల ఫోరం తేరుకోలేని షాకిచ్చింది. వారిద్దరు కలర్స్ అనే సంస్థలో నటించే వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. వీటిని తక్షణం ఆపేయాలని సూచన చేసింది. 
 
కలర్స్‌ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్‌ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో  వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు.
 
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా రాణించి, ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ బేస్ కలిగిన రాశి, రంభ వంటి సెలెబ్రిటీలు తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని సలహా ఇచ్చారు. ఇకపై ఇలాంటి ప్రకటనల పట్ల సినీతారలు మరింత అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో కొత్తచట్టం ద్వారా సెలెబ్రిటీలకు కూడా అపరాధం విధిస్తామని హెచ్చరించారు.