'ఆర్ఆర్ఆర్‌'లో అలియా ఎలా ఛాన్స్ కొట్టేసిందంటే...

alia bhat
Last Updated: శుక్రవారం, 15 మార్చి 2019 (12:48 IST)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్... శుక్రవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది. ఈమెకు 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ గురువారమే ముందుస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

"ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. భారీ తారాగ‌ణం, అతి పెద్ద టీంతో అంద‌మైన ప్ర‌యాణం ప్రారంభించ‌డానికి వేచి ఉండలేక‌పోతున్నాను. మీ ద‌ర్శ‌క‌త్వంలో గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ రాజ‌మౌళికి స్పెష‌ల్ థ్యాంక్స్" అంటూ తన ట్వీట్‌లో పేర్కొంది.

అయితే, ఈ బర్త్‌డే బ్యూటీ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఎలా ఛాన్స్ కొట్టేసిందో ఎవరికీ అంతుచిక్కలేదు. కానీ, ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక రోజు ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో త‌న‌కి ఎయిర్ పోర్ట్‌లో అలియా క‌ల‌వ‌గా, అదే స‌మ‌యంలో ఆమెకి స్టోరీ వినిపించాను. వెంట‌నే తాను ఇందులో ఏ పాత్ర‌లోనైన న‌టించ‌డానికి ఓకే చెప్పిందని వివరించారు.దీనిపై మరింత చదవండి :