సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:06 IST)

రష్మిక మందన్నా వెంటపడుతున్న దర్శకనిర్మాతలు

'ఛలో' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కన్నడ భామ రష్మిక మందన్నా. ఆమె నటించిన రెండో చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలో ఈ అమ్మడు నటకు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసేందుకు హీరోలు సైతం పోటీపడుతున్నారు. 
 
ఇప్పటికే విజయ్ దేవరకొండతో జతకట్టిన రష్మిక మందన్నా... ఇపుడు 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని పూర్తి చేసింది. అలాగే మరో యువ హీరో నితిన్‌తో "భీష్మ" చిత్రంలో నటిస్తోంది. 
 
ఇదిలావుండే, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టనుంది. దర్శకుడు అనిల్ రావిపూడి, మ‌హేష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న సినిమాలో నటించేందుకు రష్మిక ఓకే చెప్పింది. 
 
తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించ‌బోతున్న సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ హీరోగా న‌టించ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా న‌టించేందుకు ర‌ష్మిక సమ్మతం తెలిపింది. 
 
ఇకపోతే, అలాగే త్రివిక్ర‌మ్ త‌ర్వాత వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ చేయ‌బోయే సినిమాలో కూడా హీరోయిన్‌గా ర‌ష్మిక‌నే అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. హీరోలకుతోడు దర్శక నిర్మాతలు సైతం ఆమె కోసం వెయింటింగ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో టాలీవుడ్‌లో ఆమె హవా ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది.