గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:14 IST)

హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....

'మాస్ మహారాజా' రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య ఏర్పడింది. అయితే, ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది నిజ జీవితంలో కాదులెండి. ఆ సమస్య ఏంటనేది దర్శకుడు మాత్రం వెల్లడించడం లేదు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం తర్వా రవితేజ మరో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇదొక సైన్స్ ఫిక్షన్ స్టోరీ. 
 
ఇందులో రవితేజ రెండు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు ఇందులో ఆయనకు ఒక వింత ఆరోగ్య సమస్య ఉంటుంది. దాని మీదే సినిమా నడుస్తుందని తెలుస్తోంది.
 
అయితే ఆ సమస్య ఏమిటనేది సస్పెన్స్. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్, నాభ నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'డిస్కోరాజా' అనే టైటి' అనేది టైటిల్. ఈ టైటిల్ కూడా హీరోకి ఉండే ఆరోగ్య సమస్య ఆధారంగానే పెట్టారట.