సంబంధిత వార్తలు
- నా జీవనరేఖలు వీరే... టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వైఫ్ పోస్ట్
- కేజీఎఫ్ నటుడితో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్లి...?
- భర్తకు మెసేజ్‌లు పంపుతున్న మరదలిపై కేసు పెట్టిన భార్య.. ఎక్కడ?
- ప్రభాస్‌ను ఎప్పటి నుండో అడుగుతున్నా.. ఇప్పటికైనా వచ్చాడే..!: తమన్నా
- సాహో సెట్లో రొమాంటిక్ లుక్‌లో ప్రభాస్, శ్రద్ధ.. ఫోటో వైరల్
ప్రభాస్ తొలి ఫోటోకు 2,47,000లకు పైగా లైకులు
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచారు. కనీసం ప్రొఫైల్ ఫోటో కూడా లేకుండా, ఆ ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా చేయనప్పుడే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌కు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. కాగా ప్రభాస్ ఎప్పుడు ప్రొఫైల్ పిక్ పెడతారు, ఏ పిక్చర్ పెడతారు, మొదటిగా ఏం పోస్ట్ చేస్తారని అభిమానులు అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. రెబెల్ స్టార్ తాజాగా నటిస్తున్న సాహో చిత్రానికి సంబంధించిన పోస్ట్‌లు చేస్తారనీ, అందులోని స్టిల్‌నే ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటారని ఊహించుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం అభిమానుల ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించారు.
తన సినీ జీవితంలో అతిపెద్ద మైలురాయిగా నిలిచి, ప్రపంచస్థాయిలో తనకు పేరు తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ సినిమాలోని ఓ స్టిల్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోనే తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. అంతే వెంటనే లైకుల వర్షం మొదలైంది. ఫోటో పాతదే అయినప్పటికీ.. తక్కువ సమయంలోనే దానికి రెండు లక్షల నలభై ఏడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా ఒక్కసారిగా భారీగా పెరిగి ఎనిమిది లక్షలు దాటింది. కాగా.. ఆ ఖాతా ఇప్పటివరకు వెరిఫైడ్ కాకపోవడం గమనార్హం.
