సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (14:31 IST)

సాహో సెట్‌లో రొమాంటిక్ లుక్‌లో ప్రభాస్, శ్రద్ధ.. ఫోటో వైరల్

బాహుబలి చిత్రం భారతదేశ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ మరే చిత్రం చేయలేదు. అయితే సాహో చిత్రంలో నటిస్తున్నాడు.


బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుండటం, దీంతో పాటు సినిమా సైతం హైటెక్నికల్ విలువలతో తెరకెక్కుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.
 
అయితే సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క మోషన్ పోస్టర్ మినహా ఇంకేమీ రిలీజ్ కాలేదు. సాహో సెట్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నప్పటికీ అవి పెద్దగా మెప్పించలేదు. చిత్రబృందం ఇటీవలే శ్రద్ధా కపూర్ బర్త్‌డే సందర్భంగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోతుందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
తాజాగా సినీ అభిమానుల కోసం సాహో సెట్‌లో ప్రభాస్, శ్రద్ధ రొమాంటిక్‌గా ఒకరిని మరొకరు చూస్తూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోను శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోను కాస్త వైరల్ చేస్తూ..దానిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సాహో చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి రూపుదిద్దుకుంటోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15, 2020న ఈ సినిమా రిలీజ్ కానుంది.