బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:18 IST)

మళ్లీ సినిమాల్లోకి రానున్న 'బ్లేడ్' బండ్ల గణేష్..

తెలంగాణాలో జరిగిన ఎన్నికల ముందు హైపర్ యాక్టివ్‌గా ఉన్న బండ్ల గణేష్, ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఆయన పెట్టుకున్నఅంచనాలు తారుమారు అవడంతో పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో మరోసారి సినీ రంగం వైపు అతని దృష్టి పడింది. మళ్లీ సినిమాల్లో నటుడిగా కనిపించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అది కూడా సూపర్‌స్టార్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడట. 
 
మహేష్ ప్రస్తుతం నటిస్తున్న "మహర్షి" సినిమా మే 9 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 17తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు "ఎఫ్ 2" దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. 
 
ఈ సినిమాలో మహేష్‌తో పాటు హీరోయిన్‌గా రష్మిక మంధాన నటించనుంది. ఇంకా పూర్తి నటీనటుల వివరాలు తెలియరాలేదు. తాజా సమాచారం ప్రకారం ఇందులో స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన కమెడీయన్ బండ్ల గణేశ్ తిరిగి నటుడుగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ వెరీ ‘గుడ్డు’ ప్రొడ్యూసర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై తన కామెడీ టైమింగ్‌తో రచ్చ చేస్తాడో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.