సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:44 IST)

జగన్ పార్టీలో చేరిన యాంకర్ శ్యామల.. జగన్ సీఎం కావటం ఖాయం

వైకాపాలోకి ప్రముఖులు వచ్చి చేరుతున్నారు. సినీ తారలు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు ఎగబడుతున్నారు. మొన్నటికి మొన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఈరోజు రాజశేఖర్ దంపతులు వైకాపాలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోమవారం ఆమె చేరారు. 
 
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో పార్టీ కండువా కప్పి జగన్మోహన్ రెడ్డి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్ సీఎం కావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు యాంకర్ శ్యామల. 
 
రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా పాల్గొంటానని వెల్లడించారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చెప్పారు. భర్తతో కలిసి వైకాపాలో చేరానని.. జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారని చెప్పారు.