గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:55 IST)

త్రివిక్రమ్.. బన్నీల టైటిల్ 'అలకనంద'?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‍‌ల కాంబినేషన్‌లోని తాజా సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ కథ తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందనీ.. కాబట్టి దీనికి 'నాన్న- నేను' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. 
 
అయితే తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే 'సన్నాఫ్ సత్యమూర్తి' చేసి ఉండటంతో, ఈ తాజా చిత్ర కథను తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యానికి మార్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తల్లి పాత్రకి ప్రాధాన్యత సంతరించుకోవడంతో, ఆ పాత్రకి 'టబు'ని తీసుకోనున్నారని అంటున్నారు. 
 
కాగా... తల్లి పాత్ర ప్రాధాన్యత ఉన్నందువలన, టైటిల్‌లో కూడా తల్లి ప్రాధాన్యత ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో, 'అలకనంద' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్‌ను త్రివిక్రమ్ బన్నీకి చెప్పడం జరిగిందనీ, బన్నీ ఓకే అంటే ఖాయమైపోతుందని చెబుతున్నారు. మరి... సన్నాఫ్ సత్యమూర్తి అదేనండీ... బన్నీగారు ఏమంటారో చూడాలి మరి.