శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (16:07 IST)

మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్న "గీత గోవిందం" భామ

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపైన చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా గురించిన ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ ఇప్పటివరకు వెల్లడించలేదు. 
 
ఇది అటుంచితే సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథని బన్నీ కోసం తయారు చేశారట. 
 
ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్‌లో చేరిపోతుంది అని భావించవచ్చు. ఈ చిత్రం ద్వారా రష్మిక మందన్నా మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టనుందని చెప్పొచ్చు.