శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (10:27 IST)

హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ లిల్లీ: విజయ్ దేవరకొండ

ఛలో, గీత గోవిందం, దేవ‌దాసు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంథాన‌.. ప్ర‌స్తుతం కార్తీ 19వ సినిమాతో పాటు డియ‌ర్ కామ్రేడ్ , భీష్మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. మ‌హేష్ 26వ సినిమాలోను ర‌ష్మిక‌నే క‌థానాయిక‌గా ఎంపిక చేసార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ డియ‌ర్ కామ్రేడ్‌. మే 31న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవల విడుద‌లైంది. 
 
నాలుగు భాష‌ల‌లో విడుద‌లైన ఈ టీజ‌ర్ ఫైటింగ్ స‌న్నివేశంతో మొద‌లు కాగా, లిప్ లాక్ సీన్‌తో ఎండ్ చేసారు. అయితే నెటిజన్‌లు ఇదే టీజ‌ర్‌ని స్పూఫ్ చేసి కాస్త డిఫ‌రెంట్‌గా రూపొందించారు‌. నేడు రష్మిక పుట్టినరోజు పురస్కరించుకొని విజయ్ దేవరకొండ ఈ వీడియోని షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ లిల్లీ అని ర‌ష్మిక‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. అంటే డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో ర‌ష్మిక పాత్ర పేరు లిల్లీ అని తెలుస్తుంది. భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో డియ‌ర్ కామ్రేడ్ తెరకెక్కనుండగా, విజయ్ ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి ప్రేక్షకులను అల‌రించ‌నున్నాడు‌. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా.. రష్మిక మంథాన క్రికెటర్‌గా నటిస్తోంది.