సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (11:51 IST)

బరువును తగ్గిస్తానని తాకరాని చోట తాకుతూ.. హత్తుకున్నాడు..

బరువును తగ్గిస్తానని తాకరాని చోట తాకుతూ 16 ఏళ్ల యువతిపై లైంగిక చర్యలకు పాల్పడిన ఓ ఫిట్‌నెట్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. ముంబైలోని టార్డియో పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ముంబై మహాలక్ష్మీ రీకోర్స్‌లో జాగింగ్ ట్రాక్‌పై యువతి జాగింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. 29 ఏళ్ల ఫ్రీలాన్స్ పర్దేషీ మహాలక్ష్మీ రీకోర్స్ ఫిట్‌నెస్ సెంటర్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. 
 
16 ఏళ్ల యువతికి బరువు తగ్గేందుకు అతని వద్ద సలహా పొందేందుకు వచ్చింది. జాగింగ్ ట్రాక్‌పై జాగింగ్ చేయసాగింది. ఆమె దగ్గరకు వచ్చిన పర్దేషీ... కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తే టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గవచ్చంటూ తాకరాని చోట తాకాడు. 
 
వెంటనే అలర్టైన ఆ యువతి... అతన్ని బలంగా వెనక్కు నెట్టింది. తనకు ఏ టెక్నిక్‌లూ అవసరం లేదంది. అక్కడ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు ఈ విషయం వెల్లడించింది. తల్లిదండ్రులు ట్రైనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.