గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (16:11 IST)

సెల్ఫీ కావాలా? అక్కడే ఉండు తీసుకో.... దగ్గరికి రావొద్దు : కత్రినా కైఫ్

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. సెల్ఫీ పేరుతో ఆమెను చుట్టుముట్టారు. ప్లీజ్.. మేడం.. ఒక్క సెల్ఫీ అంటూ ఫ్యాన్స్ ఎగడబడ్డారు. చివరకు చచ్చీచెడీ వారి నుంచి తప్పించుకుంది. 
 
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమెను చుట్టుముట్టిన అభిమానులు.. సెల్ఫీలకు ప్రయత్నించారు. వారిలో ఒకరు కొంత అత్యుత్సాహానికి వెళ్లి, కత్రినాకు మరింత దగ్గరగా వెళ్లేందుకు ట్రై చేయడంతో సెక్యూరిటీ గార్డులు అతన్ని లాగేశారు. 
 
అయినా అతను వదల్లేదు. మరోసారి ఆమె ముందుకు వచ్చి, "మేడమ్‌.. ఒక్క సెల్ఫీ" అని కోరాడు. దీంతో అతని కోరికను మన్నిస్తూనే, "నిదానంగా... దగ్గరికి రావద్దు. అక్కడి నుంచే సెల్ఫీ దిగు" అని చెప్పింది. అక్కడే ఉన్న మీడియా ఈ దృశ్యాన్ని తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.