శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (17:36 IST)

షమీ ఓ లఫంగా గాడు..: మళ్లీ తిట్టిపోసిన అతని పెళ్లాం.

మొహమ్మద్ షమీని అతని భార్య మళ్లీ తిట్టిపోసింది. గతేడాది తన భర్తకు వివాహేతర, అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపిన హసీన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచేలా వ్యాఖ్యలు చేసింది. టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేసిన షమీ ఫాలో అవుతున్న 97 మందిలో 90 మంది మహిళలే ఉన్నారని షమీ భార్య హసీన్ జహాన్ వ్యాఖ్యలు చేసింది.
 
ప్రపంచకప్‌లో భాగంగా గత శనివారం నాడు అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. కాగా షమీ వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ హసీన్ జహాన్ ఏదో ఒక వంకతో పలు వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించేలా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ ముందు రోజు ఇలా పోస్ట్ చేస్తూ మరొకసారి రచ్చలేపింది.
 
ఆమె తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విధంగా పేర్కొంది..'లఫంగా షమీ అహ్మద్ టిక్ టాక్ ఓపెన్ చేసాడు. అందులో 97మందిని ఈ లఫంగా ఫాలో చేస్తుండగా అందులో 90 మంది మహిళలే ఉన్నారు. ఈ లఫంగా సిగ్గులేకుండా ఇలా తయారయ్యాడు. 
 
ఓ ఆడపిల్లకి తండ్రి అయిన షమీకి కూడా సిగ్గు ఉండనవసరం లేదా.. ఛీ.. ఛీ' అని పోస్టు చేసి ఆ 90 మంది యూజర్ ఐడీలను అక్కడ పోస్ట్ చేసింది. అయితే గత మ్యాచ్‌లో రాణించిన కారణంగా షమీని ఈరోజు విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు కూడా తుది జట్టులో అతనికి స్థానాన్ని కల్పించారు.