నీహారికా... ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా? మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక వార్తల్లోకి వచ్చింది. అదెలాగంటే... ఇటీవల వైజాగ్ బీచ్‌కి వెళ్లినప్పుడు నీహారిక బీచ్ ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే కామెంట్లు పెడుతున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వారి పరువు తీసేలా డ్రెస్ ఎలా వేసుకుంటావ్ అంటూ నీహారికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైన షర్ట్ వేసుకున్నావు బాగానే వుంది కానీ కింద ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐతే ఆమె వేసుకున్న ఎర్రటి షార్ట్ కనిపించకుండా వుండటంతో ఈ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నీహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.