శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (14:40 IST)

#VenkyMama #Yennallako Video song.. ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్‌లో హీరో వెంకీ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నాడు.
 
థమన్ ట్యూన్, శ్రీమణి లిరిక్స్, పృథ్వీ చంద్ర వాయిస్ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి. ‘ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే’.. అంటూ చైతూ ఇమాజినేషన్‌లోకి వెళ్లడంతో సాంగ్ స్టార్ట్ అవుతుంది. వెంకీ మామ లేటు వయసులో ప్రేమలో పడే నేపథ్యంలో ఈ పాట రూపొందింది. 1980ల కాలం నాటి వెంకీ లుక్ బాగుంది. వెంకీ, రకుల్ కెమిస్ట్రీ అదిరిపోయింది. త్వరలో ట్రైలర్ వెంకీ మామ రిలీజ్ చేయనున్నారు.