సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:27 IST)

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు.. 'వెంకీ మామ' మేకింగ్ వీడియో

సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్, యువ హీరో అక్కినేని నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న తాజా చిత్రం "వెంకీ మామ". బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
ఇక తాజాగా బాబీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది టీమ్. అందులో మామా అల్లుళ్లిద్దరు రెచ్చిపోయారు. చూస్తుంటే వీరిద్దరు ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ రైతు పాత్రలో కనిపిస్తుండగా.. చైతూ ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించనున్నాడు. 
 
మరోవైపు, ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తుంటే, ఎస్.ఎస్.తమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే నిజజీవితంలో మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, చైతూ.. ఈ మూవీలో మామఅల్లుళ్లుగా కనిపించబోతున్నారు. దీంతో ఈ కాంబోపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మామా అల్లుళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.