నాన్నకు నాకు సంబంధం లేదు... నేను మాత్రం టీడీపీలోనే : టీజీ తనయుడు

tg bharath
Last Updated: శనివారం, 22 జూన్ 2019 (11:15 IST)
తన తండ్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేష్ తనయుడు టీడీ భరత్ స్పష్టంచేశారు.

ఇటీవల టీడీపీకి చెందిన టీజీ వెంకటేష్‌తో పాటు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు వంటి నేతలు పార్టీ మారడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.

ఈ నేపథ్యంలో తన తండ్రి బాటలోనే టీజీ భరత్ కూడా పయనిస్తారనే ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై భరత్ స్పందించారు. తన తండ్రి బీజేపీలో చేరుతున్నట్టు తనకు ఢిల్లీ నుంచి ఫోనులో చెప్పారన్నారు. అయితే, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు.

ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిపారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకం ఉంచి టిక్కెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు కేటాయించారని గుర్తుచేశారు. త్వరలోనే చంద్రబాబు, నారా లోకేశ్‌లను కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానని టీజీ భరత్ వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :