గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (17:00 IST)

అమలాపాల్ 'ఆ' సినిమా హిందీలో రీమేక్ కానుందట..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఆడై సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అమలా పాల్ నటించిన ఆడై సినిమా ట్రైలర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ప్రస్తుతం అమలాపాల్ నటించిన తిరుట్టుపయలే టూ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. 
 
సుశీ గణేష్ దర్శకత్వంలో ప్రసన్న, అమలాపాల్, బాబీ సింహా నటించి గత 2017వ సంవత్సరం విడుదలై బంపర్ హిట్ అయిన తిరుట్టుపయలె-2 సినిమా బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 
 
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరెవరోనని తెలుసుకునేందుకు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.