శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (18:12 IST)

అమలాపాల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమవుతోందా??

అమలాపాల్ తాజాగా నటించిన చిత్రం 'ఆడై' సినిమా ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రత్నకుమార్ దర్శకత్వంలో అమలా పాల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'ఏ' సర్టిఫికేట్‌ను సంపాదించుకుంది.
 
అయితే... ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ గానీ.. యూ/ఏ సర్టిఫికేట్ గానీ వస్తుందని భావించిన నిర్మాతలు 'ఏ' సర్టిఫికేట్ రావడంతో కాస్త డీలా పడ్డారట. సర్టిఫికేట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను దూరం పెడతారేమోనని నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
కాగా... ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందనీ, అందువల్లనే 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారనీ మరి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అమలాపాల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త దూరమయ్యే దాఖలాలే కనబడుతున్నాయని ఊహాగానాలు వినపడుతున్నాయి.
 
మరి ఈ ఊహాగానాలు ఏ మేరకు నిజమో తెలియాలంటే త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకుని, ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.