గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (15:43 IST)

నేను నడుంకిందకు చీరకడితే అంత బజ్ వస్తుందని ఊహించలేదు...

అమలాపాల్... కేరళ నుంచి దిగుమతి అయిన బ్యూటీ క్వీన్. చిన్నవయసులోనే వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ.. ఆతర్వాత దర్శకుడుతో ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కింది. చివరకు ఆ పెళ్లి మూడు నెలల ముచ్చటగా మారింది. భర్తకు విడాకులు ఇచ్చిన అమలా పాల్ మళ్లీ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. 
 
ఈ క్రమంలో ఇటీవలికాలంలో ఆమె నటించే చిత్రాల్లో ఎక్స్‍‌పోజింగ్ గ్లామర్ ఎక్కువైంది. మాటల్లో కూడా ఘాటు పెంచింది. భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి అమల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన మీద తనే హాటు జోకులు ఏసుకునేంత స్థాయికి ఎదిగిపోయింది. 
 
ఆ మధ్య సుచీ లీక్స్‌లో అమల పేరు బాగా వినిపించింది. ఓ తమిళ హీరోతో అమ్మడు ఎంజాయ్ చేసినట్టు సుచీ లీక్స్‌లోని కొన్ని వీడియోల ద్వారా తెలిసింది. ఇపుడు ఆ వ్యవహారం అంతా సద్దుమణిగిపోయింది. కానీ, ఈ అమ్మడు మాత్రం దాన్ని మళ్లీ కదిలించింది. ఆ మధ్య 'సుచీ లీక్స్ ఏమయ్యాయి.. దాంట్లో నన్ను నేను న్యూడ్ చూసుకోవడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను' అని అమల చెప్పుకొచ్చింది. 
 
ఏదో తెలిసో తెలియక ఇలా మాట్లాడివుంటుందిలే అనుకుంటే పొరపడినట్టే. ఎందుకంటే.. తన తాజా సినిమా "తిరుట్టుపయలే-2" హాట్ లుక్ గురించి మరో కామెంట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్ల కిందట అమల పాల్ హాట్ లుక్ ఒకటి విడుదలైంది. దీనిపై అమల స్పందించింది. 
 
అదెలాగంటే.. "నిజంగా.. నా బొడ్డు అంత సంచలనం అవుతుందని అనుకోలేదు.. నేను నడుంకిందకు చీరకడితే అంత బజ్ వస్తుందని ఊహించలేదు" అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఇక్కడ ఒక సందేశం కూడా ఇచ్చిందండోయ్.. 'మనం 2019లో ఉన్నాం... ఇలాంటి విషయాలన్నింటినీ లైట్ తీసుకోవాలి..' అని అమల జాతికి సందేశం ఇచ్చింది. మొత్తానికి అమల చాలా ఎదిగిపోయింది. తన మీద తను ఘాటు జోకులు వేసుకోవడం అంటే మాటలు కాదు కదా.