శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (12:47 IST)

కాజ‌ల్‌ని వ‌ద‌ల్లేక‌పోతున్న తేజ‌... అందుకే అలా ప్లాన్ చేయ‌నున్నాడా..?

అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను "ల‌క్ష్మీ క‌ళ్యాణం" సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన దర్శకుడు తేజ. తొలి సినిమాతోనే కాజల్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత "మ‌గ‌ధీర" సినిమాలో రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకుంది. స్టార్ హీరోలు, యువ హీరోల‌తో సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. 
 
అయితే... చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత‌ కాజ‌ల్‌తో తేజ "నేనే రాజు నేనే మంత్రి" అనే సినిమా చేశారు. రానా ద‌గ్గుబాటి హీరోగా రూపొందిన ఈ సినిమా ఎన్నాళ్ల నుంచి స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న‌ తేజ‌కి మంచి విజ‌యాన్ని అందించింది. మ‌ళ్లీ స‌క్స‌స్ కోసం కాజ‌ల్‌తో తేజ "సీత" అనే సినిమాని తెర‌కెక్కించారు. 
 
వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించారు. టీజ‌ర్, ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. ఈ నెల 24న 'సీత' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
ఇదిలావుంటే, కాజల్‌తో తేజ మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నారట‌. ఈసారి లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట‌. క‌థ కూడా రెడీ చేసార‌ట‌. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ట‌. ఈ మూవీకి నిర్మాత‌లు కూడా రెడీగా ఉన్నార‌.

అయితే.. సీత రిజెల్ట్‌ను బ‌ట్టి వెంట‌నే చేయ‌డ‌మా..? లేక కొంత గ్యాప్ ఇచ్చిన త‌ర్వాత చేయ‌డ‌మా..? అనేది డిసైడ్ చేస్తార‌ని తెలిసింది. మొత్తానికి స‌క్స‌ెస్ కోసం కాజ‌ల్‌ని తేజ నమ్ముకున్నట్టున్నాడు. అందుకే వ‌ద‌ల్లేక ఆమెతో వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.