సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (07:58 IST)

ఫిట్నెస్ కోసం మలైకా పాట్లు అన్నీఇన్నీకావు...

బాలీవుడ్ నటీమణుల్లో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ మలైకా అరోరా. ఆమె ఏం పనిచేసినా అది సంచలనమే అవుతుంది. ఒకరి కౌంటరిచ్చినా.. యోగా చేసినా., వ్యాయామం చేసినా అది వార్తల్లో ప్రముఖంగా నిలవాల్సిందే. పైగా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 
 
ఈ క్రమంలో తన ఫిట్నెస్‌కు సంబంధించి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ తానెంత ఫిట్‌గా ఉన్నానో ఫ్యాన్స్‌కు చెబుతుంటుంది. ప్రస్తుతం మాలైకా వయస్సు 45 సంవత్సరాలు. ఆమె ఫిట్నెస్ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్‌కు గురికావాల్సిందే. 
 
విదేశాలకు వెళ్ళినపుడు మలైకా వివిధ రకాల భంగిమల్లో యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ముంబైలో ఓ ఫిట్నెస్ సెంటర్‌లో స్టీల్ బార్‌లపై ఆమె చేసిన ఫీట్ అందరిని ఆకట్టుకుంటుంది. మామూలు వ్యక్తులు ఆ ఫీట్ చేయాలంటే చాలా కష్టం. కానీ, మలైకా మాత్రం ఆ ఫీట్‌ను సునాయాసంగా చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. లేటు వయుసులో ఘాటు ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది.