అల్లు అరవింద్‌కి మంచి వారసుడు కాలేకపోయాడు కానీ... అంటున్న నేచురల్ స్టార్
మెగా కుటుంబానికి చెందిన మరో హీరో అల్లు శిరీష్. ఈయన హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై 'అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' ట్యాగ్ లైన్‌తో రూపొందుతోన్న చిత్రం 'ఏబీసీడీ'.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్"యు" సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని చిత్ర యూనిట్ ఇటీవల నిర్వహించింది.ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే "పిల్ల జమీందార్" సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాను మించిన హిట్ 'ఏబీసీడీ' సినిమా సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
'శిరీష్‌లో ఓ చిన్నపిల్లాడు ఉండేవాడు. నేను యాక్టింగ్ ప్రారంభించిన కొత్తల్లో శిరీష్‌ను అప్పుడప్పుడు కలిసాను. అప్పుట్లో తను కాస్త లావుగానూ, బొద్దుగానూ ఉండేవాడు. తను సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాస్తూండేవాడు. ప్రొడక్షన్‌లో అల్లు అరవింద్‌కి మంచి వారసుడు దొరికాడని అనుకున్నాను. కానీ కట్ చేస్తే తను కూడా యాక్టర్ అయిపోయాడు. తనకు ఆల్ ది వెరీ బెస్ట్. తన కెరీర్‌కు సంబంధించి 'ఏబీసీడీ'లు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్, తన స్టార్ డమ్‌కు సంబంధించిన 'ఏబీసీడీ'లు ఈ సినిమాతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.