శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (07:52 IST)

ఏం నీకు గర్ల్‌ఫ్రెండ్ లేదా...

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు. చిత్రం పేరు "కబీర్ సింగ్". తెలుగులో విజయ్ దేవరకొండ నటిస్తే, బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ నటించాడు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. 
 
ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదల కాగా, మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌లో ముద్దు సన్నివేశాలున్న అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రిపోర్టర్ సినిమాలో ఎన్ని కిస్ సీన్లు ఉన్నాయని హీరోయిన్ కియారా అద్వానీని ప్రశ్నించగా, ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేదని కియారా సమాధానమిచ్చింది. 
 
అయితే, ఆ విలేఖరి ముద్దు సన్నివేశాలను వదిలిపెట్టకుండా పదేపదే ప్రశ్నలు సంధించాడు. దీన్ని గమనించిన హీరో షాహిద్ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది. "నీకు గర్ల్‌ఫ్రెండ్ లేనట్లనిపిస్తోంది. మా చిత్రంలో లిప్‌లాక్ సీన్ చూడాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే.. ఒక్క సీన్ కోసమే అని చెప్పడం లేదు. సినిమాను వదిలిపెట్టి కేవలం ముద్దు సన్నివేశాలపై ఎందుకు అడుతున్నార"ని మండిపడ్డాడు. దీంతో ఆ విలేఖరి నోర్మూసుకుని కూర్చొన్నాడు.