గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (10:12 IST)

ఈషా రెబ్బాపై టాలీవుడ్ స్టార్ హీరోల చిన్నచూపు... ఎందుకని?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనుకంజ వేయదు. కానీ, టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఆమెవైపు కన్నెత్తిచూడటం లేదట. దీంతో ఈ బ్యూటీ తెగబెంగపెట్టుకుందట. 
 
ఇటీవల త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అరవింద సమేత". ఇందులో రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం కొట్టేసింది. అదేసమయంలో ఈ అమ్మడుకు స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నప్పటికీ.. అగ్ర హీరోలతో నటించే అవకాశమే రావడంలేదని వాపోతోంది.
 
దీంతో పెద్ద హీరోలతో ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అదేసమయంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్‌లు చేస్తూ... సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తాజాగా, జిగేల్ అనిపించే బ్లాక్ కలర్ డ్రెస్‌తో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.