నాని మల్టీస్టారర్‌కు ముహుర్తం ఫిక్స్...
నేచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా సక్సస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సంవత్సరంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... నాని, సుధీర్ బాబుతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేద థామస్ నటించనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నారు. అష్టాచమ్మా, జెంటిల్ మెన్ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తోన్న మూడవ సినిమా కాగా, సమ్మోహనం తర్వాత ఇంద్రగంటితో సుధీర్ బాబు చేస్తోన్న రెండో సినిమా ఇది.
ఈ సినిమాని ఈ నెల 26న ప్రారంభించనున్నారని సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమాని ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.