నా గురువుతో నటిస్తున్నా : ఐశ్వర్యారాయ్

aishwarya rai
Last Updated: శనివారం, 25 మే 2019 (09:56 IST)
మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తన గురువు, లెజండరీ దర్శకుడు మణిరత్నం తీయబోయే సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. చెక్క చీవంత వానమ్‌ (తెలుగులో నవాబ్) సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఐశ్వర్య నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఐష్ తాజా ప్రకటనతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది.

ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ స్పందిస్తూ ‘‘అవును నా గురువు మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా. ఇందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాపై ఆయన ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. నా గురువుతో మరోసారి పనిచేసేందుకు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా’’ అంటూ తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, అమలా పాల్, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నట్లు, ఇందులో ఐశ్యర్యరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనిపై మరింత చదవండి :