శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (16:11 IST)

ఐష్ బేబి బంప్‌తో కనిపిస్తోంది! ఏంటి సంగతి? ప్రెగ్నెంటా?

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మళ్లీ గర్భందాల్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది. సాధారణంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన కుటుంబానికి చెందిన విషయాలను ఎంతో సీక్రెట్‌గా ఉంచుతాడు. పార్టీలు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌లో పెద్ద‌గా పాల్గొనరు. పైగా, వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన హోలీ వేడుక‌లలో బాలీవుడ్ తారాగ‌ణం అంతా పాల్గొని సంద‌డి చేశారు. కానీ, ఐష్ మాత్రం తన భర్తతో కలిసి సేలవులను ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్ళారు. అక్క‌డ బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో తిరుగుతుండగా, ఓ ఫోటోగ్రాఫర్ కంటపడ్డారు. వెంట‌నే ఆ ఫోటోతో గోవా లోక‌ల్ న్యూస్ పేప‌ర్ క‌థ‌నం ప్ర‌చురించింది. అయితే ఆ ఫోటోలో ఐష్ బేబి బంప్‌తో క‌నిపిస్తుంద‌ని, త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌నుందంటూ ప్ర‌చారాలు మొద‌లు పెట్టారు. మ‌రి దీనిపై ఐష్ కాని, అభిషేక్‌కాని స్పందిస్తారేమో చూడాలి.