సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:05 IST)

అమితాబ్, ఐష్‌తో స్క్రీన్ పంచుకోనున్న కీర్తి సురేష్

మహానటితో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ మలయాళ బ్యూటీ చేతి నిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాను చేస్తుండగా, హిందీలో ఒక సినిమా చేస్తోంది. 
 
వీటితో పాటు ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం. 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాలో కీర్తి యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్నాడు. 
 
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తారాగణం కూడా భారీగానే ఉండబోతోందట. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.