శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:53 IST)

‘మహానటి’కి మరో చరిత్రాత్మక పాత్ర... అదేంటంటే?

‘మహానటి’ సినిమాలో సావిత్రమ్మ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్లు నటించి అందరి చేతా ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్‌కు మరో చారిత్రాత్మకమైన పాత్రను పోషించే అవకాశం వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో కుందవై నాచ్చియార్‌ పాత్రకు కీర్తి సురేష్‌ ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

ఎంజీఆర్‌ నుండి కమల్‌ హాసన్‌ వరకు పలువురు అగ్రహీరోలు ఈ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరింపజేయాలని ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మణిరత్నం కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. 
 
ఎట్టకేలకు ఈ ఏడాదిలోనే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్‌ ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు రూ.200 కోట్ల ఉండవచ్చునని సమాచారం. కోలీవుడ్‌ సమాచారం మేరకు అమితాబ్‌ బచ్చన్‌, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, మోహన్‌బాబు, కీర్తి సురేష్‌లు ప్రధాన తారాగణంగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరి పూర్తి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడనుందో వేచి చూద్దాం...