సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (12:09 IST)

రజనీ .. మురుగదాస్ మూవీ ఆలస్యం కావడానికి కారణం అదేనా??

మునుపటితో పోల్చితే... రజినీకాంత్ ఈ మధ్య కాలంలో పెద్ద గ్యాపు ఇవ్వకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అదే ఊపుతో మురుగదాస్ సినిమాని కూడా పట్టాలెక్కించాలని అనుకున్నారు... కానీ ఈ ప్రాజెక్టు ఈ నెలలో పట్టాలెక్కబోవడంలేదట.


వచ్చే నెల 10వ తేదీ తరువాత ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉందట ఈ సినిమా యూనిట్. కాగా... ఈ సినిమా ఆలస్యానికి ఎన్నికల ప్రభావమే కారణం అని చెప్పుకొస్తున్నారు. 
 
ఎన్నికల సమయం కావడంతో బ్యాంకుల నుండి పెద్ద మొత్తాల్లో డ్రా చేయబడే నగదుపై పోలీస్ శాఖ ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో... ఎక్కడ పెద్ద మొత్తంలో డబ్బు లభించినా వెంటనే సీజ్ చేసేయడం జరుగుతోంది. 
 
రజినీ సినిమా అంటేనే భారీ బడ్జెట్‌తో కూడుకుని ఉండడం వలన, డబ్బు భారీ మొత్తంలోనే అవసరమవుతుంది... కాబట్టి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ సినిమాను వచ్చే నెలలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. కాగా... ఈ సినిమాలో కథానాయికలుగా నయనతార - కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.