బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (20:56 IST)

ప్లీజ్.. ఆయనతో త్వరగా చేయాలి... తొందరపెడుతున్న కీర్తి సురేష్

వయస్సు పైబడుతున్నా సినిమాలు మాత్రం తగ్గిచడం లేదు రజనీకాంత్. సినిమాల మీద సినిమాలను చేస్తూనే ఉన్నారు. సినిమాలు ఫ్లాపయినా అస్సలు పట్టించుకోవడం లేదు. అలాగని రాజకీయాలవైపు కూడా స్పష్టంగా మాట్లాడడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద హిట్టున్న సినిమాలు రాకపోవడంతో ఎలాగైనా భారీ హిట్ సినిమాలో నటించాలన్న ఆలోచనలో ఉన్నాడు రజినీకాంత్.
 
తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ ఒక సినిమా చేయాలనుకుంటున్నారు. ఇద్దరు హీరోయిన్లు ఒకరు నయనతార.. మరొకరు కీర్తి సురేష్. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్‌తో నటించేందుకు కీర్తి సురేష్‌ చాలా తొందరపడుతోంది. మురుగదాస్‌ను త్వరగా సెట్స్ పైకి సినిమాలను తీసుకెళ్ళమని కోరుతోందట. ఇప్పటికే సినిమాకు సంబంధించి కథ పూర్తయిందట. ఇక మిగిలింది షూటింగేనంటున్నారు దర్సకుడు మురుగదాస్.