సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (15:55 IST)

లోక్‌సభ - ఉప ఎన్నికలకు దూరం : రజనీకాంత్

వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో కూడా పోటీ చేయడంలేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు.
 
చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమిళనాడులో రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. రజనీ స్పందిస్తూ.. తమిళనాడులో నీటి సంక్షోభం నివారణ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేస్తారో.. ప్రజలు వారికే ఓటేయాలని రజనీ పిలుపునిచ్చారు. 
 
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని.. అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమన్నారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్న వారెవరూ.. వేరే ఏ పార్టీ కోసం, ప్రచారం కోసం తన ఫొటోను ఉపయోగించొద్దని ఇప్పటికే కోరారు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌ని విషయం తెలిసిందే.