శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (18:56 IST)

ఫ్రీగా మందు దొరకలేదు.. మహిళపై కత్తులతో దాడి చేసిన రౌడీ

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉచితంగా మద్యం లభించడం ఆగిపోయిందనే అక్కసుతో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళపై రౌడీ కత్తులతో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, కాసిమేడుకు చెందిన సత్య పోలీసులకు తెలియకుండా దొంగతనంగా మద్యం అమ్మేది. ఈమె వద్ద ఉచితంగా మద్యం తీసుకునే తాగుతూ వచ్చాడు.. రౌడీ శ్రీధర్ (42). 
 
అయితే ఉన్నట్టుండి సత్య ఈ మద్యం అమ్మకాన్ని నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సత్య వద్ద ఉచితంగా మద్యం అందించాలని రౌడీ అడగడం.. ఆమె దొంగతనం మద్యం అమ్మడాన్ని ఆపేసినట్లు చెప్పింది. అయితే సత్యపై ఎదురింటి మహిళ మల్లికా (35) పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఈమె ఫిర్యాదు చేయడం వల్లే తనకు ఉచితంగా లభించే మద్యం ఆగిపోయిందని భావించిన రౌడీ మల్లికను కత్తులతో దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.