శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (15:44 IST)

ఎ.ఎన్.ఆర్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా..?

మ‌హా న‌టుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను ఎవ‌రికి ఇవ్వ‌నున్నారో అక్కినేని నాగార్జున ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీ‌దేవికి ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారం ల‌భించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రేఖకు కూడా ఈ అవార్డు అందిస్తున్నారు.

ఈ నెల 17న హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన, ఫొటోలను నాగ్ విడుదల చేశారు.
 
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. 
 
చిరు చేతుల మీదుగానే ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాగా.. శ్రీ‌దేవి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆమె త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్‌లు ఈ అవార్డు స్వీక‌రించనున్నారు. ఏఎన్నార్ జ్ఞాపికతో పాటు అవార్డు కింద రూ.5 ల‌క్షల న‌గ‌దును వారికి చిరు అందజేస్తారు.