గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (09:29 IST)

నేను చేసాను.. ఆయన చేయాల్సిందే : పవన్‌కు కృష్ణ ఛాలెంజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సూపర్ స్టార్ కృష్ణ ఓ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కృష్ణ ఈ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మొక్కలు నాటిన హీరో కృష్ణ... ఆ తర్వాత పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు విక్టరీ వెంకటేశ్‌లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. 
 
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించిన సంతోష్ కుమార్‌ను అభినందించారు. త్వరలోనే గ్రీన్ చాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని, విధిగా మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, 'మనం సైతం' కాదంబరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.