గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (11:58 IST)

అసుర‌న్ రీమేక్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు..?

త‌మిళ్‌లో ధ‌నుష్ న‌టించ‌గా ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం అసుర‌న్. ఈ సినిమాని తెలుగు రీమేక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్నారు. కొత్త బంగారు లోకం, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ముకుందా చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ వైజాగ్‌లో జ‌రుగుతోంది.
 
ఈ మూవీ గురించి వెంకీ క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ వెంకీ ఈ మూవీ గురించి ఏం చెప్పాంర‌టే... శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు. బేసిగ్గా హార్డ్ వర్కర్. నేను కూడా ఇంతకు ముందు తనతో పని చేసి ఉన్నాను కాబట్టి మా ఇద్దరికీ మంచి రిలేషన్ షిప్ ఉంది. 
 
సీతమ్మ వాకిట్లో.. తరవాత కూడా ఓ రెండు స్క్రిప్ట్స్ చెప్పాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మా ఇద్దరికీ కుదిరింది. మరో ఛాలెంజింగ్ తీసుకుని వ‌ర్క్ చేస్తున్నాడు. సినిమా జనవరి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. స‌మ్మ‌ర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని స్వ‌యంగా వెంక‌టేష్ తెలియ‌చేసారు. మ‌రి.. త‌మిళ్ లో స‌క్స‌స్ సాధించిన అసుర‌న్ తెలుగులో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.